Ukraine | కీవ్: పరస్పర దాడులతో రష్యా, ఉక్రెయిన్ అట్టుడుకుతున్నాయి. గత 24 గంటల వ్యవధిలో రష్యాపై దీర్ఘ శ్రేణి క్షిపణి దాడులు చేశామని, ఆ దేశానికి చెందిన ఒక జలాంతర్గామిని ముంచేశామని, ఓ వైమానిక స్థావరాన్ని ధ్వంసం చేశామని ఉక్రెయిన్ సైనిక అధికారులు వెల్లడించారు.
రష్యా ఆక్రమిత క్రిమియాలోని సెవెస్తోపోల్ పోర్టులో శత్రు దేశానికి చెందిన కిలో-క్లాస్ సబ్‌మెరైన్, ఎస్-400 గగనతల రక్షణ వ్యవస్థ కాంప్లెక్స్‌పై దాడి చేశామని ఉక్రెయిన్ జనరల్ స్టాఫ్ శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. రోస్తోవ్ రీజియన్‌లోని మొరోజొవ్స్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి చేశామని పేర్కొన్నది.