రష్యా దాడి కారణంగా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్న ఉక్రెయిన్ను ఆదుకోవడానికి 266 కోట్ల రూపాయలపైగా విరాళాలు సేకరించిందో జంట. అమెరికాకు చెందిన ఆష్టన్ కుచర్, మిలా కునిస్ దంపతులు ఉక్రెయిన్‌కు అండగా ఉండేందుకు ముందుకొచ్చారు. ఉక్రెయిన్‌పై రష్యా దళాలు దాదాపు నెలరోజులుగా దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ యుద్ధం కారణంగా 10 లక్షల మందికిపైగా ఉక్రేనియన్లు స్వదేశం విడిచిపారిపోయారు.
కీలకమైన నగరాలన్నీ రష్యా దాడిలో చాలా నష్టపోయాయి. ఈ క్రమంలో ఆష్టన్, మిలా దంపతులు సోషల్ మీడియా సాయంతో తమ వంతు సాయం చేయాలని నిర్ణయించుకున్నారు. తను ఉక్రెయిన్‌లోనే పుట్టానని మిలా చెప్పింది. ‘‘నేను అమెరికన్ పౌరురాలిని అని ఎప్పుడూ గర్విస్తా. కానీ ఇప్పుడు మాత్రం ఉక్రెయిన్‌లో పుట్టినందుకు ఇంకా గర్విస్తున్నా’’ అని ఆమె చెప్పింది.
అదే సమయంలో ఆష్టన్ కూడా ఉక్రెయిన్ మహిళను పెళ్లి చేసుకున్నందుకు తాను కూడా చాలా గర్విస్తున్నానని చెప్పాడు. ఇప్పుడు అందరూ కలిసి వచ్చి ఉక్రెయిన్‌కు అండగా నిలవాలని వీళ్లిద్దరూ నెటిజన్లను కోరారు. దీనికోసం గోఫండ్‌మీ పేజిలో విరాళాలు సేకరించడం ప్రారంభించారు. ఇప్పటి వరకు వీళ్లిద్దరూ 35 మిలియన్ డాలర్లు (రూ.266కోట్లపైగా) విరాళాలు సేకరించారు.
ఈ క్యాంపెయిన్ ఇంకా ముగియలేదు. ఇది పూర్తవగానే వచ్చిన సొమ్మును ఎయిర్ బీఎన్బీ, ఫ్లెక్స్‌పోర్ట్ ద్వారా ఉక్రెయిన్‌కు పంపుతారట. ఇదే విషయాన్ని ట్వీట్ చేసిన ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్స్కీ.. ఈ అమెరికన్ జంటకు ధన్యవాదాలు తెలిపారు. ఇలాంటి వాళ్లే ప్రపంచంలో స్ఫూర్తి నింపుతారని కొనియాడారు.
.@aplusk & Mila Kunis were among the first to respond to our grief. They have already raised $35 million & are sending it to @flexport & @Airbnb to help 🇺🇦 refugees. Grateful for their support. Impressed by their determination. They inspire the world. #StandWithUkraine pic.twitter.com/paa0TjJseu
— Володимир Зеленський (@ZelenskyyUa) March 20, 2022
We are overwhelmed with gratitude for your support. 2 weeks ago, we asked you to join us and more than 65,000 of you stepped up and donated what you could. Now, with your help we have reached our $30 million goal. (1/5) pic.twitter.com/zQfQ1BNWZm
— ashton kutcher (@aplusk) March 17, 2022