Ahmedabad Plane Crash | అహ్మదాబాద్ విమాన ప్రమాదం (Ahmedabad Plane Crash)పై బ్రిటన్ ప్రధాన మంత్రి (UK PM) కీర్ స్టార్మర్ (Keir Starmer) స్పందించారు. ఈ మేరకు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో చిక్కుకున్న వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. బ్రిటీష్ పౌరులతో లండన్ వెళ్తున్న విమానం అహ్మదాబాద్‌లో కూలిపోయిందని, పరిస్థితిపై భారత్‌ను సంప్రదిస్తున్నట్లు తెలిపారు.
ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన పోస్టు పెట్టారు. ‘బ్రిటీష్ జాతీయులతో లండన్ వెళ్తున్ ఎయిర్ ఇండియా విమానం భారతదేశంలోని అహ్మదాబాద్ నగరంలో కూలిపోయింది. ఆ దృశ్యాలు హృదయ విదారకంగా ఉన్నాయి. పరిస్థితిపై భారత్‌ను సంప్రదించి వివరాలు తెలుసుకుంటున్నాం. ప్రమాదంలో చిక్కుకున్న వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’ అని తన ఎక్స్ పోస్ట్‌లో కీర్ స్టార్మర్ పేర్కొన్నారు.
ఎయిర్ ఇండియా విమానం గురువారం మధ్యాహ్నం 1.39 గంటలకు ఇద్దరు పైలట్లు, 10 మంది క్యాబిన్ సిబ్బందితో పాటు 242 మంది ప్రయాణికులతో లండన్ బయల్దేరింది. మొత్తం 242 మందిలో 169 మంది భారతీయులుగా అధికారులు తెలిపారు. మరో 53 మంది బ్రిటన్ దేశస్థులు, ఏడుగురు పోర్చుగల్ పౌరులు, ఒకరు కెనడా జాతీయుడు ఉన్నారు. విమానం టేకాఫ్ అయిన నిమిషాల వ్యవధిలోనే ఎయిర్‌పోర్టుకు సమీపంలోని సివిల్ ఆస్పత్రి వద్ద బీజే మెడికల్ కాలేజీ హాస్టల్ (medical college hostel) భవనంపై కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 133 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. మరోవైపు ప్రమాదంలో హాస్టల్ భవనాలు కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి. అందులోని 20 మంది మెడికోలు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.
Also Read..
Ahmedabad Plane Crash | అహ్మదాబాద్‌లో కూలిన ఎయిర్ ఇండియా విమానం.. 133 మంది మృతి..?
Ahmedabad Plane Crash | హాస్పిటల్ హాస్టల్ బిల్డింగ్‌పై కూలిన విమానం.. 20 మంది మెడికోలు మృతి..!