Smartwatch | చేతికి కట్టుకునే స్మార్ట్‌వాచ్ (Smartwatch) ఓ కంపెనీ సీఈవో (Company CEO) ప్రాణాల్ని కాపాడింది. యూకేకి చెందిన 42 ఏళ్ల పాల్ వాఫమ్ హాకీ వేల్స్ (Hockey Wales) అనే కంపెనీకి సీఈవో. అతడు నిత్యం ఉదయం పూట జాగింగ్‌కు వెళ్తుంటాడు. అలా ఇటీవలే జాగింగ్‌కు వెళ్లాడు. అయితే, అలా ఇంటి నుంచి బయటకు వెళ్లిన కాసేపటికే ఛాతిలో నొప్పితో (Heart Attack) రోడ్డుపై కుప్పకూలిపోయాడు. ఇక వెంటనే తన చేతికి ఉన్న స్మార్ట్‌వాచ్ ద్వారా ఇంట్లో ఉన్న భార్యకు ఫోన్ చేశాడు. ఐదు నిమిషాల వ్యవధిలోనే సీఈవో భార్య అక్కడికి చేరుకొని అతడిని సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లింది. డాక్టర్లు సైతం సరైన సమయంలో వైద్యం అందించడంతో సీఈవో ప్రాణాలు నిలిచాయి. గుండె దమనుల్లో ఒకటి పూర్తిగా బ్లాక్ కావడంతో ఇలా గుండెపోటు వచ్చినట్లు వైద్యులు గుర్తించారు. ఈ మేరకు శస్త్రి చికిత్స చేశారు. చికిత్స అనంతరం ఆరురోజుల తర్వాత సీఈవో ఇంటికి చేరుకున్నాడు.
డిశ్చార్జై ఇంటికి చేరిన పాల్.. తనకు ఎదురైన అనుభవాన్ని పంచుకున్నాడు. ‘నేను రోజూలాగే ఉదయం 7 గంటలకు మార్నింగ్ వాక్కు వెళ్లా. ఐదు నిమిషాల్లోనే నా ఛాతి బిగుతుగా అనిపించింది. వెంటనే విపరీతమైన నొప్పి మొదలైంది. దీంతో నేను రోడ్డుపైనే పడిపోయా. వెంటనే నా చేతికి ఉన్న స్మార్ట్ వాచ్ సాయంతో నా భార్య లారాకు ఫోన్ చేశా. అదృష్టవశాత్తు ఇంటికి ఐదు నిమిషాల దూరమే కావడంతో తను అక్కడికి చేరుకుని కారులో ఆసుపత్రికి తీసుకెళ్లింది. వైద్యులు కూడా సకాలంలో స్పందించడంతో ప్రాణాలు దక్కాయి. ఇలా జరగడం నాకే కాదు, నా కుటుంబ సభ్యులను కూడా షాక్‌కు గురి చేసింది’ అని చెప్పుకొచ్చారు.
స్మార్ట్‌వాచ్‌లు.. లుక్పరంగా స్టైలిష్‌గా ఉంటాయి. అంతే కాకుండా వీటి పనితీరు కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇందులో ఎన్నో రకాల అధునాతన ఫీచర్లు ఉండటంతో.. వీటిని చాలా మంది విలాసవంతమైన వస్తువులుగా పరిగణిస్తారు. ఈ వాచ్‌లు కేవలం టైమ్ చూసుకోవడానికి మాత్రమేకాదు.. మన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడానికి కూడా బాగా ఉపయోగపడతాయి. అలా ఇప్పటికే చాలా మంది వీటి కారణంగా ప్రాణాలు దక్కించుకోగలిగారు. గుండెపోటు లక్షణాలను ముందుగానే గుర్తించడం కారణంగా చాలా మంది ప్రాణాలతో బయటపడిన సందర్భాలు అనేకం ఇప్పటికే వెలుగులోకి వచ్చాయి. స్మార్ట్ వాచుల్లో ఉండే హృదయ స్పందన రేటు, ఈసీజీ, వంటి సెన్సర్లు గుండెపోటు ముప్పును ముందుగానే గుర్తించడంలో సాయపడుతున్నాయి.
Also Read..
Bengaluru Traffic | ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయిన ఫెరారీ సూపర్ కార్లు.. VIDEO
Viral Video | ఐదేళ్ల తర్వాత ప్రియుడిని కలుసుకున్న యువతి.. ఎయిర్‌పోర్ట్‌లో డ్యాన్స్‌తో స్వాగతం పలికి
Supreme Court | ప్రజాప్రతినిధులపై క్రిమినల్ కేసుల విచారణ.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు