న్యూఢిల్లీ, మే 23: చివరి నిమిషంలో చేసే దౌత్యపరమైన ప్రయత్నాలు విఫలమైన పక్షంలో ఇరాన్‌పై దాడులు ప్రారంభించే విషయాన్ని అధ్యక్షుడు ట్రంప్ పరిశీలిస్తున్నారని అమెరికా అధికారులను ఉటంకిస్తూ ఆక్సియోస్ వార్తాసంస్థ తెలిపింది. ట్రంప్ తన ఉన్నత జాతీయ భద్రతా బృందంతో సమావేశం నిర్వహించిన అనంతరం ఈ అంచనా వెలువడింది. ఈ చర్చల్లో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారని సమాచారం. ప్రస్తుత చర్చలు విఫలమైతే అమల్లోకి వచ్చే ప్రత్యామ్నాయాల గురించి అధ్యక్షుడికి వివరించినట్లు వర్గాలు తెలిపాయి. అమెరికా, ఇరాన్ మధ్య మధ్యవర్తిత్వ ప్రయత్నంలో భాగంగా పాకిస్థాన్ సైన్యాధ్యక్షుడు మునీర్ ప్రస్తుతం టెహ్రాన్‌లో ఉన్నారు.