అమెరికాలో ఆగని తుపాకుల మోత..
Gun Attack | అగ్రరాజ్యం అమెరికాలో గన్‌కల్చర్ కొనసాగుతున్నది. మంగళవారం ఓ వ్యక్తి జరిపిన కాల్పుల్లో ఇద్దరు పోస్టల్ సర్వీస్ ఉద్యోగులు మరణించారు.

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో గన్‌కల్చర్ కొనసాగుతున్నది. మంగళవారం ఓ వ్యక్తి జరిపిన కాల్పుల్లో ఇద్దరు పోస్టల్ సర్వీస్ ఉద్యోగులు మరణించారు. అమెరాకలోని మెమ్ఫిస్లోని టెన్నెస్సీ పోస్టాఫీస్‌లో ఓ వ్యక్తి తుపాకీతో కాల్పులు జరిపాడు. దీంతో యూఎస్ పోస్టల్ సర్వీస్ ఉద్యోగులు ఇద్దరు చనిపోయారు. అయితే కాల్పులకు పాల్పడిన వ్యక్తి కూడా పోస్టల్ ఉద్యోగే అని పోస్టల్ ఇన్స్పెక్టర్ సుసాన్ తెలిపారు. కాల్పులు జరిపిన వ్యక్తి ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, అతనికోసం పోలీసులు గాలిస్తున్నారని వెల్లడించారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామని చెప్పారు.
అమెరికాలో కాల్పులకు పాల్పడటం సర్వ సాధారణమైపోయింది. దేశంలో ప్రతిరోజూ ఏదో ఒక ప్రాంతంలో దుండగులు తుపాకీతో విరుచుకుపడుతూనే ఉంటారు. ప్రజలు విచ్చలవిడిగా తుపాకుల ఉపయోగించకుండా కఠినమైన చట్టాలు తీసుకురావాలని సామాజిక వేత్తలు కోరుతున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Supreme Court | పనులు చేయకుంటే మేమే ధర్నాకు దిగుతాం.. కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
Greater Noida | గ్రేటర్ నోయిడాలో ఘోర విషాదం.. ఐదుగురి ప్రాణం తీసిన నూడుల్స్, టీ!
Supreme Court | పిల్లలకు ఇంటర్నెట్పై నిషేధం తగదు.. కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం
FSSAI | బిస్కెట్లలో దాణా.. పాలల్లో డిటర్జెంట్.. మూడు కంపెనీలపై ఎఫ్ఎస్ఎస్ఏఐ కేసులు
Uttarakhand | సీఎం సార్..నా భార్య అవినీతి లెక్క తేల్చండి..! ఉత్తరాఖండ్ మహిళా మంత్రిపై భర్త ఆరోపణలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

