బెర్న్, మార్చి 19: రైలు ప్రయాణానికి రైలు మార్గంలో రెండు పట్టాలు ఉంటే చాలు.. కానీ, ఆ రైలు కోసం చాలా స్థలాన్ని ఉపయోగిస్తారు. ఆ స్థలాన్ని కూడా వినియోగించేలా సౌర ఫలకలను రూపొందించిందో స్విట్జర్లాండ్‌కు చెందిన స్టార్టప్ కంపెనీ. ఈ సోలార్ ప్యానెళ్లను రెండు పట్టాలకు మధ్య అమర్చుతారు.
దీనివల్ల రైలు రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఆ ప్యానెళ్లను కావాల్సినప్పుడు తొలగించవచ్చు కూడా. రైలు మార్గాల్లోనూ స్థలాన్ని వాడుకొనే ఉద్దేశంతో తాము వీటిని అభివృద్ధి చేశామని సన్-వేస్ స్టార్టప్ వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని రైలు మార్గాల్లో వీటిని అమర్చవచ్చని వివరించింది.