LPG ships : అమెరికా, ఇరాన్ (US, Iran) మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ పర్షియన్ గల్ఫ్ (Parsian Gulf) నుంచి భారత్‌కు వంటగ్యాస్ (LPG) తీసుకువస్తున్న రెండు నౌకలు కీలకమైన హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) ని విజయవంతంగా దాటాయి. ‘సిమి’ అనే ఎల్పీజీ నౌక గురువారం ఒమన్ గల్ఫ్‌లోకి ప్రవేశించింది. ఈ ప్రయాణ సమయంలో తన ట్రాన్స్‌పాండర్‌ను తాత్కాలికంగా స్విచ్ ఆఫ్ చేసినట్లు తెలిసింది. ఈ నౌక ఖతార్‌లోని రాస్ లఫాన్ పోర్టు నుంచి గుజరాత్ (Gujarat) లోని కాండ్లాకు వస్తోంది.
ఇక యూఏఈలోని రువాయిస్ రిఫైనరీ నుంచి వంటగ్యాస్‌తో బయలుదేరిన ‘ఎన్వీ సన్‌షైన్’ అనే మరో నౌక కూడా హర్మూజ్ జలసంధిని దాటిన తర్వాత సిగ్నల్స్ నిలిపివేసింది. ఈ నౌక కర్ణాటకలోని మంగళూరు వైపు ప్రయాణిస్తున్నట్లు తెలిసింది. ఇదిలావుంటే ఇరాన్‌తో కాల్పుల విరమణ ప్రయత్నాలు ‘లైఫ్ సపోర్ట్‌పై’ ఉన్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల వ్యాఖ్యానించారు. అమెరికా ప్రతిపాదించిన శాంతి ఒప్పందంపై ఇరాన్ స్పందన ‘పూర్తిగా ఆమోదయోగ్యం కాదు’ అని తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ట్రూత్ సోషల్’లో పేర్కొన్నారు.
కాగా ప్రపంచ ముడిచమురు, ఎల్ఎన్జీ రవాణాలో అధిక భాగం హర్మూజ్ జలసంధి నుంచే జరుగుతుంది. ముఖ్యంగా భారత్‌కు అవసరమైన ఇంధన సరఫరాలో ఈ మార్గం చాలా కీలకమైనది.