మెల్బోర్న్: ఆస్ట్రేలియాలో సోమవారం రెండు హెలికాప్టర్లు ఢీకొన్న ఘటనలో నలుగురు దుర్మరణం చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఆస్ట్రేలియాలో ప్రస్తుతం వేసవి సీజన్ కావడంతో పెద్ద సంఖ్యలో పర్యాటకులు క్వీన్ల్యాండ్స్ గోల్డ్ తీరానికి వచ్చి సేద తీరుతుంటారు. మధ్యాహ్నం ఒక హెలికాప్టర్ ల్యాండ్ అవుతుండగా.. మరో హెలికాప్టర్ టేకాఫ్ అవుతున్న సమయంలో రెండూ ఢీకొనడంతో ఈ ఘటన జరిగినట్టు క్వీన్లాండ్స్ ఇన్స్పెక్టర్ ఓరెల్ పేర్కొన్నారు.