ఓ వ్యక్తి అతిగా మద్యం సేవించాడు.. ఆ తర్వాత తప్పిపోయాడు. అదృశ్యమైన ఆ వ్యక్తి తనకు తానే వెతుక్కున్నాడు. చివరకు పోలీసుల వెంటే అతను ఉన్న విషయాన్ని గ్రహించి, అందరూ ఆశ్చర్యపోయారు.
టర్కీకి చెందిన బెయన్ ముట్లు(50) అనే వ్యక్తి తన స్నేహితులతో కలిసి మద్యం సేవించాడు. అతిగా మద్యం సేవించడంతో.. అతను ఏం చేస్తున్నాడో అతనికే అర్థం కాలేదు. మద్యం సేవించిన స్థలానికి కొద్ది దూరంలో ఉన్న అడవుల్లో ముట్లు అదృశ్యమయ్యాడు. దీంతో ఆ వ్యక్తి ఫ్రెండ్స్ పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు.. ముట్లు ఆచూకీ కోసం అడవిని జల్లెడ పట్టారు.
ఈ పోలీసుల బ్యాచ్‌లోనే ముట్లు కూడా ఒక ప్రాంతంలో కలిసిపోయాడు. గంటల తరబడి పోలీసుల వెంటే ఆ వ్యక్తి ఉన్నాడు. కానీ అతను ముట్లు అని పోలీసులు భావించలేదు. చివరకు బెయాన్ ముట్లు ఎక్కడున్నావ్? అని పోలీసులు గట్టిగా కేకలు వేయడంతో అతను ఆశ్చర్యపోయాడు. ముట్లు తానే అని చెప్పేసరికి పోలీసులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తన కోసం కాకుండా మరొకరి కోసం గాలిస్తున్నారేమో అనుకున్నానని ముట్లు చెప్పడంతో పోలీసులు షాక్ అయ్యారు.
Bursa'nın İnegöl ilçesinde, Beyhan Mutlu isimli şahıs, kendisi için başlatılan arama çalışmalarını başkası için zannederek saatlerce kendini aradı.
— Vaziyet (@vaziyetcomtr) September 28, 2021
Ekipler, arama çalışmasıyla ilgili tutanak düzenleyip kayıp şahsı evine bıraktılar. pic.twitter.com/yhVaPSh7wY