Turkish Airlines plane | ల్యాండింగ్ సమయంలో విమానం చక్రాల్లో చెలరేగిన మంటలు..!
Turkish Airlines plane | ల్యాండింగ్ (Landing) సమయంలో విమానం చక్రాల్లో మంటలు చెలరేగాయి. ఇవాళ ఉదయం నేపాల్ (Nepal) రాజధాని ఖాఠ్మండు (Khatmandu) లోని త్రిభువన్ దాస్ (Tribhuvandas) ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు (International Airport) లో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే ప్రయాణికులు, సిబ్బంది అంతా క్షేమంగా ఉన్నారని అధికారులు తెలిపారు.
Turkish Airlines plane : ల్యాండింగ్ (Landing) సమయంలో విమానం చక్రాల్లో మంటలు చెలరేగాయి. ఇవాళ ఉదయం నేపాల్ (Nepal) రాజధాని ఖాఠ్మండు (Khatmandu) లోని త్రిభువన్ దాస్ (Tribhuvandas) ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు (International Airport) లో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే ప్రయాణికులు, సిబ్బంది అంతా క్షేమంగా ఉన్నారని అధికారులు తెలిపారు. ఇస్తాంబుల్ నుంచి ఖాఠ్మండుకు వచ్చిన టర్కిష్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం ల్యాండవుతున్న సమయంలో కుడివైపు చక్రాలకు మంటలు అంటుకున్నాయి.
చక్రాల నుంచి దట్టమైన పొగ వచ్చింది. ఇక విమానం ల్యాండవగానే అక్కడకు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేశారు. ప్రయాణికులను ఎమర్జెన్సీ తలుపు నుంచి సురక్షితంగా కిందకు దించారు. ప్రమాద సమయంలో విమానంలో 277 మంది ప్యాసింజర్స్, 11 క్రూ మెంబర్స్ ఉన్నారు. ఐక్యరాజ్యసమితికి చెందిన సిబ్బంది కూడా విమానంలో ఉన్నారని స్థానిక అధికారులు తెలిపారు. ఈ ఘటనకు కారణమేంటో ఇంకా తెలియరాలేదు. ఎయిర్‌లైన్స్ కూడా ఈ ఉదంతంపై స్పందించాల్సి ఉంది.
త్రిభువన్ దాస్ ఎయిప్పోర్టులో గతంలో కూడా టర్కీ విమానాల్లో ఇలాంటి ఘటనలు జరిగాయి. 2015లో ల్యాండింగ్ సమయంలో ఒక విమానం బ్యాలెన్స్ తప్పి రన్‌వేపై నుంచి జారీ పక్కకు వెళ్లిపోయింది. ఈ క్రమంలో ఎయిర్‌పోర్టును నాలుగు రోజుల పాటు మూసేయాల్సి వచ్చింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

