టోక్యో, జనవరి 13: వాయువ్య జపాన్లోని క్యూషూ ద్వీపంలో సోమవారం భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.9గా నమోదైంది. స్థానిక కాలమానం ఉదయం 9.29 గంటలకు మియాజకీ ప్రాంతంలో భూకంపం సంభవించినట్టు జపాన్ వాతావరణ శాఖ తెలిపింది.
భూమిలోపల 37 కిలోమీటర్ల లోతులో భూప్రకంపనలు ఏర్పడినట్టు యూరోపియన్ మెడిటెర్రానియన్ సీస్మాలాజికల్ సెంటర్(ఈఎంఎస్సీ) తెలిపింది. గత ఏడాది రెండు శక్తివంతమైన భూకంపాలు సంభవించాయి.