బీబీ.. బీ కేర్‌ఫుల్.. దాడులు కొనసాగితే ఏకాకిగా ఇజ్రాయెల్ : ట్రంప్
ఇరాన్‌పై భారీ స్థాయి సైనిక చర్యను ప్రారంభిస్తే ఇజ్రాయెల్ ఏకాకిగా మిగిలిపోవచ్చని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహును ట్రంప్ హెచ్చరించారు. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య గత 24 గంటలుగా ఉద్రిక్తతలు పెరిగిన అనంతరం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆక్సియోస్ వార్తాసంస్థతో మాట్లాడుతూ బీబీ.. మీరు జాగ్రత్తగా ఉండటం మంచిది.
న్యూఢిల్లీ, జూన్ 9 : ఇరాన్‌పై భారీ స్థాయి సైనిక చర్యను ప్రారంభిస్తే ఇజ్రాయెల్ ఏకాకిగా మిగిలిపోవచ్చని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహును ట్రంప్ హెచ్చరించారు. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య గత 24 గంటలుగా ఉద్రిక్తతలు పెరిగిన అనంతరం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆక్సియోస్ వార్తాసంస్థతో మాట్లాడుతూ బీబీ.. మీరు జాగ్రత్తగా ఉండటం మంచిది. లేకపోతే త్వరలోనే మీరు ఒంటరిగా మిగిలిపోతారు అని నెతన్యాహుకు చెప్పాను అని తెలిపారు.
తిరిగి ఘర్షణలు చెలరేగితే ఇరాన్‌తో దౌత్య ఒప్పందం కుదుర్చుకునే ప్రయత్నాలకు ఆటంకం కలుగవచ్చని, అంతేగాక అమెరికాను ప్రాంతీయ ఘర్షణలలోకి మరింత లోతుగా లాగవచ్చన్న తన ఆందోళన పెరుగుతున్నదని ట్రంప్ ఆక్సియోస్‌కు తెలిపారు. ఆదివారం బీరుట్‌లోని హెజ్బొల్లా లక్ష్యాలపై ఇజ్రాయెల్ దాడులు చేయడం, ఇందుకు ప్రతీకారంగా ఇరాన్ తన క్షిపణులతో ఇజ్రాయెల్‌పై దాడి చేయడంతో మళ్లీ ప్రాంతీయ యుద్ధ భయాల నేపథ్యంలో నెతన్యాహుకు ట్రంప్ తాజా హెచ్చరికలు జారీచేశారు.
హొర్ముజ్ వద్ద కూలిన అమెరికా అపాచీ హెలికాప్టర్
హొర్ముజ్ వద్ద యూఎస్‌కు చెందిన అపాచీ హెలికాప్టర్ కుప్పకూలింది. ఇందులో ఉన్న ఇద్దరు పైలట్లు సురక్షితంగా బయటపడ్డట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. హెలికాప్టర్ కూలిపోయిన చోటనే యూఎస్ డ్రోన్లను కూల్చినట్టు ఇరాన్ ప్రకటించింది. హెలికాప్ట్టర్ కూల్చిన ఘటనకు ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్‌ను ట్రంప్ హెచ్చరించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

