వాషింగ్టన్: ప్రపంచ దేశాలపై సుంకాలతో (Trump Tariffs) అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరోసారి విరుచుకుపడ్డారు. 70కిపైగా దేశాలపై ఉన్న పరస్పర సుంకాలను 10 శాతం నుంచి 41 శాతం వరకు పెంచారు. ఈ మేరకు కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకాలు చేశారు. కెనడాపై ఇప్పటివరకు 25 శాతంగా ఉన్న టారీఫ్‌లను 35 శాతానికి పెంచారు. ఇక భారత్‌పై 25 సుంకాలు విధిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించిన ట్రంప్.. అత్యధికంగా సిరియాపై 41 శాతం సుంకాలు విధించారు. వాణిజ్య ఒప్పందం నేపథ్యంలో యూరోపియన్ యూనియన్‌కు సుంకాల విషయంలో కొంత వెసులుబాటు కల్పించారు. 15 శాతం కంటే ఎక్కువ సుంకాల రేట్లు ఉన్న వస్తువులకు కొత్త టారీఫ్‌ల నుంచి మినహాయింపునిచ్చారు.