 
                                                            బుసాన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాతో కీలక ఒప్పందం కుదుర్చుకున్నారు. గురువారం దక్షిణ కొరియాలోని బూసాన్‌లో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో భేటీ అనంతరం, చైనాపై సుంకాలను 10 శాతం తగ్గిస్తున్నట్టు ప్రకటించారు.
వాణిజ్యం, అరుదైన ఖనిజాల ఎగుమతి సహా ముఖ్యమైన అంశాలపై ఇరు దేశాల మధ్య ఒక అవగాహన కుదిరిందని, దీంతో చైనాపై టారిఫ్‌ను 57 శాతం నుంచి 47 శాతానికి తగ్గిస్తున్నట్టు ట్రంప్ చెప్పారు. అలాగే అరుదైన ఖనిజాల విషయంలో చైనాతో నెలకొన్న సమస్యను పరిష్కరించినట్టు ఆయన అన్నారు.
 
                            