శనివారం 04 జూలై 2020
International - Jun 24, 2020 , 03:20:27

శరాఘాతం

శరాఘాతం

  • ట్రంప్‌ నిర్ణయంతో హెచ్‌1బీతోపాటు 
  •  పలు క్యాటగిరీల వీసాదారులకు దెబ్బ
  • బాధితుల్లో అత్యధికులు భారతీయ నిపుణులే

వాషింగ్టన్‌: హెచ్‌1బీతోపాటు ఇతర పని ఆధారిత వీసాల జారీపై ఈ ఏడాది చివరి వరకు నిషేధం విధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆదేశాలు జారీచేశారు. భారతీయ ఐటీ నిపుణులకు ఇది శరాఘాతంగా మారనుంది. అమెరికా ఏటా 85,000 హెచ్‌1బీ వీసాలను జారీచేస్తుండగా, అందులో సగటున 60,000 వీసాలు భారతీయులే పొందుతున్నారు. ట్రంప్‌ నిర్ణయంతో హెచ్‌1బీతోపాటు ప్రభావితమయ్యే పలు క్యాటగిరీల వీసాదారుల వివరాలు..

హెచ్‌1బీతోపాటు ఇతర పని ఆధారిత వీసాల జారీపై ఈ ఏడాది చివరి వరకు నిషేధం విధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆదేశాలు జారీచేశారు. భారతీయ ఐటీ నిపుణులకు ఇది శరాఘాతంగా మారనుంది. అమెరికా ఏటా 85,000 హెచ్‌1బీ వీసాలను జారీచేస్తుండగా, అందులో సగటున 60,000 వీసాలు భారతీయులే పొందుతున్నారు. ట్రంప్‌ నిర్ణయంతో హెచ్‌1బీతోపాటు ప్రభావితమయ్యే పలు క్యాటగిరీల వీసాదారుల వివరాలు..

హెచ్‌2బీ: నాన్‌ అగ్రికల్చరల్‌ లేబర్‌ కోసం ఈ వీసా జారీచేస్తారు. అమెరికా ఏటా 66000 హెచ్‌2బీ వీసాలను జారీచేస్తున్నది. మూడేండ్ల వరకు వీటికి కాలపరిమితి ఉంటుంది. ఫుడ్‌ ప్రాసెసింగ్‌, హోటల్‌ తదితర రంగాల సంస్థలు ఈ వీసా ప్రోగ్రామ్‌ ద్వారా విదేశీ ఉద్యోగులను నియమించుకుంటాయి. 

హెచ్‌-4: హెచ్‌1బీ, హెచ్‌2బీ వీసాదారుల భాగస్వాములకు ఈ వీసా జారీచేస్తారు. హెచ్‌1బీకి ఉన్న గడువే హెచ్‌4కీ వర్తిస్తుంది. గతేడాది అమెరికా 1,25,999 హెచ్‌4 వీసాలను జారీచేసింది. వీరిలో సుమారు 1,06,162 మంది భారతీయులే కావడం విశేషం. ఆ తర్వాతి స్థానంలో చైనా (5,701)ఉన్నది. 

జే1: సాంస్కృతిక, ఎడ్యుకేషనల్‌ ఎక్సేంజ్‌ ప్రోగ్రామ్‌లలో భాగంగా అమెరికాలో పర్యటించే వారికి ఈ వీసా జారీ చేస్తారు. గరిష్ఠంగా ఏడేండ్ల వరకు దీనికి గడువు ఉంటుంది. 2019లో 3,53,279 జే1 (రెన్యువల్స్‌తో కలిపి) వీసాలను జారీచేశారు. 

జే2: హెచ్‌2బీ మాదిరే, ఈ వీసాను జే1 వీసాదారుల భాగస్వాములకు జారీచేస్తారు. జే1 వీసా కాలపరిమితే దీనికీ వర్తిస్తుంది. ట్రంప్‌ సర్కార్‌ గతేడాది 38,000కుపైగా జే2 వీసాలను జారీచేసింది. 

ఎల్‌-1: అత్యున్నత స్థాయి ఉద్యోగులకు ఈ వీసాలను జారీచేస్తారు. గరిష్ఠ పరిమితి ఏడేండ్లు. 2019లో 76,988 ఎల్‌1 వీసాలను ప్రభుత్వం జారీచేసింది. 

ఎల్‌-2: ఎల్‌-1 వీసాదారుల భాగస్వాములు, వారిపై ఆధారపడిన వారికి (డిపెండెంట్స్‌) ఈ వీసా జారీచేస్తారు. ఎల్‌1 వీసాకున్న కాలపరిమితే దీనికీ వర్తిస్తుంది. గతేడాది 80,720 మందికి ఎల్‌2 వీసాలు జారీచేయగా, అందులో భారతీయులే 23,169 మంది ఉన్నారు.


logo