వాషింగ్టన్ : ఇరాన్‌లోని సౌత్ పార్స్ గ్యాస్ క్షేత్రంపై ఇజ్రాయెల్ జరిపిన దాడి గురించి తమకు సమాచారం ఇవ్వలేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గురువారం తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద గ్యాస్ క్షేత్రాన్ని లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ దాడులు జరపడంతో గురువారం ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. దీనికి ప్రతీకారంగా ఇరాన్ గల్ఫ్ దేశాల్లోని పలు గ్యాస్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపింది.
ఈ నేపథ్యంలో సౌత్ పార్స్‌పై ఇజ్రాయెల్ ఇకపై ఎలాంటి దాడులు చేయదని ట్రంప్ ప్రకటించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. పశ్చిమాసియాలో జరిగిన సంఘటనలపై కోపంతో ఇరాన్‌లోని సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్ అనే ఒక ప్రధాన సదుపాయంపై ఇజ్రాయెల్ హింసాత్మకంగా దాడి చేసింది అని ట్రంప్ తన ట్రూత్ సోషల్ పోస్టులో పేర్కొన్నారు. ఈ ప్రత్యేక దాడి గురించి అమెరికాకు ఏమీ తెలియదన్నారు.