అంకారా: ఇరాన్‌తో సీజ్ఫైర్ ముగిసినట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(Donald Trump) తెలిపారు. టర్కీలోని అంకారాలో జరుగుతున్న నాటో సమావేశంలో పాల్గొంటున్న ఆయన.. అక్కడ మీడియాతో మాట్లాడారు. ఇరాన్‌తో నెలకొన్న సంక్షోభాన్ని పరిష్కరించేందుకు ఆ దేశంతో కుదిరిన ఒప్పందం ముగిసినట్లు ట్రంప్ పేర్కొన్నారు. ఇక టెహ్రాన్‌తో వైరాన్ని కోరుకోవడం లేదన్నారు. ఇరాన్‌తో కుదిరిన తాత్కాలిక ఒప్పందం ముగిసిందన్నారు. కానీ ఇరాన్‌తో చర్చలను కొనసాగించనున్నట్లు ఆయన చెప్పారు. సీజ్ఫైర్ గురించి స్టేటస్ అడిగిన సమయంలో ఆయన స్పందిస్తూ.. నా వరకు ఇది ముగిసిపోయిందని, ఇక ఇరాన్‌తో డీల్ చేయడం అంటే సమయాన్ని వృధా చేయడమే అవుతుందన్నారు.
ఇరాన్‌తో చర్చలు జరపడం వృధా అని, వాళ్లు అబద్దాలు చెబుతున్నారని, చీటింగ్ చేస్తున్నారని, వాళ్లు వ్యాధిగ్రస్తులు అని తెలిపారు. తాజాగా ఇరానీ మిలిటరీ టార్గెట్లపై దాడులు చేసిన తర్వాత అమెరికా అధ్యక్షుడు ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ఆ తాజా దాడులకు ప్రతీకారకంగా బహ్రెయిన్, కువైట్ దేశాల్లో ఉన్న అమెరికా స్థావరాలపై ఇరాన్ అటాక్ చేసింది.