వాషింగ్టన్, మార్చి 11: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కెనడాపై మరో టారిఫ్ బాంబు పేల్చారు. కెనడా నుంచి అమెరికా దిగుమతి చేసుకుంటున్న విద్యుత్తు శక్తిపై ఒంటారియో(కెనడా ప్రావిన్స్) పరస్పర సుంకాలు విధించటం ట్రంప్ సర్కార్ను మరింత ఆగ్రహానికి గురిచేసింది. దీంతో కెనడా నుంచి దిగుమతి అవుతున్న అన్ని రకాల స్టీల్, అల్యూమినియం ఉత్పత్తులపై సుంకాల్ని 25 నుంచి 50శాతానికి పెంచుతూ ట్రంప్ సర్కార్ మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది.