వాషింగ్టన్, ఆగస్టు 28: అమెరికా విధించిన అదనపు టారిఫ్ల అమలు మన దేశంలో బుధవారం నుంచి ప్రారంభమైంది. రష్యా నుంచి చమురును కొనుగోలు చేయడం ద్వారా రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి భారత్ ఆర్థిక సహాయం అందిస్తున్నదని ఆరోపించిన శ్వేత సౌధం వాణిజ్య సలహాదారు పీటర్ నవారో ఇది ‘మోదీ యుద్ధం’గా అభివర్ణించారు.
ఇప్పటికైనా భారత్కు మించిపోయిందేమీ లేదని, ఆ దేశం రష్యా నుంచి చమురు కొనుగోలును నిలిపివేస్తే రేపటి నుంచే 25 శాతం సుంకాలను తగ్గిస్తామని ఆయన ఆఫర్ ఇచ్చారు. శాంతికి మార్గం పాక్షికంగా న్యూఢిల్లీ నుంచి వెళుతున్నది కాబట్టి తాను మోదీ యుద్ధం గురించి మాట్లాడుతున్నానని ఆయన పేర్కొన్నారు.