Donald Trump | కొన్ని రోజుల క్రితం ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ దంపతులు గొడవపడ్డ వీడియో ఒకటి తీవ్ర చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump), ఆయన సతీమణి, ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్ (Melania Trump) గొడవపడుతున్నట్లు ఓ వీడియో బయటకు వచ్చింది.
న్యూయార్క్లో జరిగిన ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ (United Nations General Assembly) సమావేశాలకు ట్రంప్ తన భార్య మెలానియాతో కలిసి హాజరైన విషయం తెలిసిందే. సమావేశాల అనంతరం మెరైన్ వన్ (Marine One) హెలికాప్టర్లో అధ్యక్షుడి దంపతులు తిరుగు పయనమయ్యారు. ఆ సమయంలో హెలికాప్టర్లో ఎదురెదురుగా కూర్చున్న ట్రంప్-మెలానియా ఒకరివైపు ఒకరు వేలు చూపించుకుంటూ మాట్లాడుతూ కనిపించారు. వారిద్దరూ ఏదో విషయంపై గొడవ పడుతున్నట్లు ఆ వీడియో ద్వారా స్పష్టంగా తెలుస్తోంది.
దీన్ని హెలికాప్టర్ బయటి నుంచి ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. ప్రస్తుతం అదికాస్తా వైరల్గా మారింది. ఈ వీడియో చూసిన వారంతా ట్రంప్-మెలానియా దంపతులు గొడవ పడుతున్నారంటూ మాట్లాడుకుంటున్నారు. కొందరు ఈ సమావేశాలకు వెళ్లే ముందు ట్రంప్ దంపతులు ఎక్కిన ఎస్కలేటర్ ఆగిపోయిన విషయం తెలిసిందే. దాని గురించే ఇద్దరూ చర్చించుకుంటున్నట్లు చెబుతున్నారు.
📹Journalists captured on video what appears to be an argument between Trump and his wife Melania
The footage shows the U.S. President wagging his finger at the First Lady, while she shakes her head in response.
It’s unclear what they were discussing on board the plane, but… pic.twitter.com/3xGwDXgrFu
— NEXTA (@nexta_tv) September 26, 2025
Also Read..
Petal Gahlot | ఐరాస వేదికగా పాక్ ప్రధానికి గట్టిగా బదులిచ్చిన పేటల్ గహ్లోత్.. ఇంతకీ ఎవరీమె..?
Rahul Gandhi | మరోసారి అమెరికా పర్యటనకు వెళ్లిన రాహుల్ గాంధీ