Donald Trump | అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తన కుటుంబ సభ్యులకు కీలక పదవులను అప్పగిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా కాబోయే కోడలికి కీలక పదవి కట్టబెట్టారు. తన కుమారుడు డొనాల్డ్ జూనియర్ (Donald Jr)కు కాబోయే భార్య కింబర్లీ గిల్ఫోయిల్ (Kimberly Guilfoyle)ను గ్రీక్ రాయబారిగా (United States ambassador to Greece) నియమించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ట్రంపే స్వయంగా ప్రకటించారు.
గ్రీక్‌తో బలమైన ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించుకునేందుకు, రక్షణ సహకారం, వాణిజ్యం, ఆర్థిక ఆవిష్కరణలు తదితర విషయాల్లో కింబర్లీ బలమైన దౌత్య సంబంధాలు నెలకొల్పగలదని ఈ సందర్భంగా ట్రంప్ ఆకాంక్షించారు. కాగా, కింబర్లీ గతంలో ఫాక్స్‌న్యూస్ హోస్ట్‌గా పనిచేశారు. అనంతరం పొలిటికల్ ఫండ్ రైజర్గానూ బాధ్యతలు నిర్వహించారు. మీడియా, రాజకీయాలతో ఆమెకు ఉన్న విస్తృత అనుభవం, నాయకత్వంతోపాటు తెలివితేటలు ఆమెకు ఈ పదవి కట్టబెట్టడానికి కారణమని ట్రంప్ పేర్కొన్నారు. కాగా, డిసెంబర్ 31, 2020లో ట్రంప్ కుమారుడు జూనియర్ ట్రంప్‌తో కింబర్లీ నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే.
ఇక ఇటీవలే ట్రంప్ తన వియ్యంకులకు కీలక పదవులు అప్పగించిన విషయం తెలిసిందే. పశ్చిమాసియా వ్యవహారాల సలహాదారుగా మస్సద్ బౌలోస్‌ను ఎంపిక చేసుకున్నారు. బౌలోస్ లెబనీస్-అమెరికన్ వ్యాపారవేత్త. ఆయన కుటుంబ సభ్యులకు నైజీరియా, లెబనాన్లలో వ్యాపారాలు ఉన్నాయి. ట్రంప్ చిన్న కుమార్తె టిఫ్ఫనీని బౌలోస్ కుమారుడు మైఖేల్ వివాహం చేసుకున్నారు. ఇక మరో వియ్యంకుడు చార్లెస్ కుష్నర్ను ఫ్రాన్స్ రాయబారిగా ఎంపిక చేసుకున్నారు. ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్కు తండ్రి చార్లెస్ కుష్నర్.
Also Read..
Birthright Citizenship: పౌరసత్వ జన్మహక్కును తొలిగించే ఆలోచనలో ట్రంప్ !
South Korea: కస్టడీలోనే దక్షిణ కొరియా మాజీ రక్షణ మంత్రి ఆత్మహత్యాయత్నం
US Student Visa | స్టూడెంట్ వీసాలకు అమెరికా కోత..!