సియోల్: దక్షిణ కొరియా(South Korea) రక్షణ శాఖ మాజీ మంత్రి కిమ్ యాంగ్ హున్.. పోలీసుల కస్టడీలోనే ఆత్మహత్యకు ప్రయత్నించారు. కానీ చివరి నిమిషాల్లో ఆయన ప్రయత్నాలను అడ్డుకున్నారు. గత రాత్రి బలవన్మరణానికి పాల్పడేందుకు కిమ్ ట్రై చేశారు. కానీ అతన్ని గుర్తించడంతో ఆ ప్రయత్నం నుంచి అతను తప్పుకున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం ఆయన్ను గార్డింగ్ రూమ్‌లో పెట్టారు. ఆయనకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవు. ఇటీవల దక్షిణ కొరియా ప్రధాని సైనిక పాలన ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆ ప్రతిపాదన చేసింది మంత్రి కిమ్.
దక్షిణకొరియాలో డిసెంబర్ 3వ తేదీ సైనిక పాలన విధిస్తూ ప్రకటన చేశారు. ఆ కేసులో కిమ్ యాంగ్‌ను అరెస్టు చేశారు. డిటెన్షన్ సెంటర్లో ఆయన ఆత్మహత్యకు ప్రయత్నించారు. అండర్వియర్ ద్వారా కిమ్ సూసైడ్ చేసుకునేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఆదివారం రోజు రక్షణ శాఖ మాజీ మంత్రి అదుపులోకి తీసుకున్నారు. బుధవారం రోజున అతన్ని అధికారికంగా అరెస్టు చేశారు. అధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌పై తిరుగుబాటుకు పాల్పడినట్లు కిమ్‌పై ఆరోపణలు ఉన్నాయి.