బుధవారం 02 డిసెంబర్ 2020
International - Nov 04, 2020 , 01:59:46

గూగుల్‌లో ట్రంప్‌ ముందంజ!

గూగుల్‌లో ట్రంప్‌ ముందంజ!

  •  ప్రీ పోల్‌ సర్వేలో బిడెన్‌ పూర్తి ఆధిపత్యం

వాషింగ్టన్‌: డొనాల్డ్‌ ట్రంప్‌, జో బిడెన్‌లలో ఎవరు అగ్రరాజ్యాధిపతి అవుతారనే అంశం ఉత్కంఠను రేపుతున్నది. ప్రీ పోల్‌ సర్వేలో బిడెన్‌ ఆధిపత్యం ప్రదర్శించారు. కానీ, పరిస్థితి మారినట్టు తెలుస్తున్నది. ఓటింగ్‌ ప్రారంభం కావటానికి కొన్ని గంటల ముందు ఇంటర్నెట్‌ సెర్చ్‌ డాటాలో ట్రంప్‌ దూసుకుపోతున్నారు. ఇంటర్నెట్‌లో ట్రంప్‌ గురించే ఎక్కువ మంది వెదుకుతున్నారని గూగుల్‌ సెర్చ్‌ డాటా ప్రకటించింది. దాంతో ఓటరు ఎవరివైపు మొగ్గుచూపుతాడనేది ఆసక్తికరంగా మారింది. అమెరికాలో విపరీతమైన అభిమానగణం ఉన్న నల్లజాతి పాప్‌ గాయకుడు లిల్‌ వేనెతోపాటు మరికొంత మంది ర్యాపర్స్‌ ఇటీవల ట్రంప్‌ను కలిశారు. తాజా ఎన్నికల్లో కీలకంగా మారిన జాతి వివక్ష అంశంపై ట్రంప్‌ విధానాలకు లిల్‌ మద్దతు ప్రకటించటం సంచలనంగా మారింది. ఇంటర్నెట్‌లో ట్రంప్‌ కోసం వెదికినవారంతా ఆయనకు ఓటు వేసే అవకాశాలు లేవని పరిశీలకులు అంటున్నారు.