వాషింగ్టన్: భారత్‌తో త్వరలోనే భారీ ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అన్నారు. ఇప్పటికే చైనాతో ఒక వాణజ్య ఒప్పందం (Trade Deal) కుదిరిందని చెప్పారు. వైట్‌హౌస్‌లో బిగ్ బ్యూటిఫుల్ బిల్ కార్యక్రమంలో ట్రంప్ మాట్లాడుతూ.. ప్రతిఒక్కరూ తమతో ఒక ఒప్పందం కుదుర్చుకోవాలని చూస్తున్నారన్నారు. చైనాతో (China) నిన్ననే వాణిజ్య ఒప్పందంపై సంతకాలు చేశామని తెలిపారు. కొన్ని గొప్ప దేశాలతో ఒప్పందాలు కుదరనున్నాయని చెప్పారు. ఇందులో భాగంగా త్వరలో భారత్‌తో ఒక భారీ ఒప్పందం జరగొచ్చని వెల్లడించారు. భారత్‌లో తాము మార్కెట్లు తెరవబోతున్నామని పేర్కొన్నారు. కాగా, తాము అన్ని దేశాలతో వాణిజ్య ఒప్పందాలు చేసుకోవాలనుకోవడం లేదన్నారు. వాటితో ఎలాంటి వాణిజ్యం ఉండదని స్పష్టం చేశారు. కొన్ని దేశాలకు కేవలం ఒక లేఖ పంపి.. 25, 35 లేదా 45 శాతం పన్నులు చెల్లించాలని చెబుతామన్నారు. చైనా నుంచి అమెరికాకు అరుదైన ఖనిజాలను వేగంగా రవాణా చేయడానికి ఒప్పందం కుదిరిందని ట్రంప్ వెల్లడించారు.
గత ఏప్రిల్‌లో భారత్ సహా పలు దేశాలపై ట్రంప్ టారీఫ్‌లు విధించిన విషయం తెలిసిందే. దీంతో అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం చేసుకోవాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఇటీవల కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్ లుట్నిక్‌తో సమావేశమయ్యారు. రెండు దేశాలు పరస్పరం లాభదాయకమైన వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకునే దిశగా చర్చలు జరిగాయన్నారు. అంతకుముందు పీయుష్ గోయల్ నేతృత్వంలోని ఉన్నతాధికారుల బృందం మే 16 నుంచి నాలుగు రోజులపాటు అమెరికాలో పర్యటించింది. ఇరు దేశాల మధ్య ప్రతిపాదిత ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరిపారు.
#WATCH | “…We just signed (trade deal) with China. We’re not going to make deals with everybody… But we’re having some great deals. We have one coming up, maybe with India, a very big one. We’re going to open up India. In the China deal, we’re starting to open up China.… pic.twitter.com/fJwmz1wK44
— ANI (@ANI) June 26, 2025