Donald Trump | ఎన్నికల ప్రచారంలో పిజ్జాలు పంపిణీ చేసిన ట్రంప్.. వీడియో
Donald Trump | ఎన్నికల ప్రచారంలో (Election Campaign) భాగంగా అమెరికా (America) మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తన మద్దతుదారులకు పిజ్జాలు పంపిణీ చేశారు.
Donald Trump | అమెరికా (America) మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) శైలి చాలా భిన్నంగా ఉంటుంది. అతను ఏం చేసినా.. ఏం మాట్లాడినా సంచలనమే. తరచూ ఏదో ఒక విషయంలో హైలెట్ అవుతూ నిరంతరం వార్తల్లో నిలుస్తుంటారు. ఇప్పుడు కూడా ట్రంప్ విషయంలో అలాంటిదే జరిగింది. ఎన్నికల ప్రచారంలో (Election Campaign) భాగంగా ట్రంప్ తన మద్దతుదారులకు పిజ్జాలు (Pizza) పంపిణీ చేసి హెడ్‌లైన్స్‌లో నిలిచారు.
అమెరికాలో 2024 అధ్యక్ష ఎన్నికల వేడి మొదలైంది. రిపబ్లికన్ పార్టీ తరపున ట్రంప్ మరోసారి అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడుతున్నారు. ఈ సందర్భంగా తన ప్రచారాన్ని ముమ్మరం చేశారు. బుధవారం నాడు అయోవా (Iowa)లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడ ఓ బార్లో తన మద్దతుదారులకు పిజ్జాలు పంపిణీ చేశారు. ఆ బార్లో వంద మందికిపైగా ప్రజలు గుమిగూడారు. ఆ సమయంలో ట్రంప్ తన చేత్తో పిజ్జా బాక్స్‌ను పట్టుకొని ‘పిజ్జా ఎవరికి కావాలి..?’ అంటూ వాటిని అక్కడున్న వారికి అందించాడు. అనంతరం వారందరికీ ఆటోగ్రాఫ్స్ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
“We want pizza from Trump!”🍕 pic.twitter.com/QdWOKEFkkS
— Jason Miller (@JasonMillerinDC) September 20, 2023
THANK YOU IOWA—MAGA!!!https://t.co/YWWI03ZCKV
(Donald Trump Truth Social Post 08:18 PM EST 9/20/23) pic.twitter.com/l0LLoL89Ho
— Donald J. Trump Posts From His Truth Social (@TrumpDailyPosts) September 21, 2023
Also Read..
Donald Trump | మా నాన్న డొనాల్డ్ ట్రంప్ చనిపోయారు.. జూనియర్ ట్రంప్ ట్వీట్ వైరల్
Khalistani Terrorist | కెనడాలో మరో ఖలిస్థాని ఉగ్రవాది దారుణ హత్య
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

