Khalistani Terrorist | కెనడాలో మరో ఖలిస్థాని ఉగ్రవాది దారుణ హత్య
Khalistani Terrorist | కెనడా (Canada)లో మరో ఖలిస్థాని ఉగ్రవాది (Khalistani Terrorist) దారుణ హత్యకు గురయ్యాడు. ఖలిస్థాన్ ఉగ్రవాది అర్షదీప్ సింగ్ అలియాస్ అర్ష దాలా అనుచరుడైన సుఖ్దూల్ సింగ్ (Sukhdool Singh) కెనడాలోని విన్నిపెగ్ పట్టణంలో హత్యకు గురయ్యాడు.
Khalistani Terrorist | కెనడా (Canada)లో మరో ఖలిస్థాని ఉగ్రవాది (Khalistani Terrorist) దారుణ హత్యకు గురయ్యాడు. ఖలిస్థాన్ ఉగ్రవాది అర్షదీప్ సింగ్ అలియాస్ అర్ష దాలా అనుచరుడైన సుఖ్దూల్ సింగ్ (Sukhdool Singh) కెనడాలోని విన్నిపెగ్ పట్టణంలో హత్యకు గురయ్యాడు. బుధవారం రాత్రి రెండు గ్రూపుల మధ్య (Gang War) చోటుచేసుకున్న ఘర్షణల్లో అతడు మరణించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
ఏ-కేటగిరీ గ్యాంగ్ స్టర్ అయిన సుఖ్దూల్ సింగ్ పంజాబ్‌లోని మోగా జిల్లాకు చెందిన వ్యక్తి. 2017లో నకిలీ పత్రాలపై భారత్ నుంచి కెనడా పారిపోయాడు. అప్పటి నుంచి కెనడాలోనే ఉంటూ ఖలిస్థాన్ అనుకూల కార్యకలాపాలకు పాల్పుడుతున్నాడు. అతను టెర్రరిస్ట్ అర్ష్‌దీప్ దల్లాకు అత్యంత సన్నిహితుడు. అదేవదిధంగా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్‌తో అతడికి సంబంధాలు ఉన్నట్లు ఎన్ఐఏ తేల్చింది. కెనడాలో ఖలిస్థాన్ ఉగ్రవాద సంస్థతో సంబంధాలు కలిగి ఉన్న 43 మంది గ్యాంగ్స్టర్లలో ఒకడని పేర్కొంది.
ఈ ఏడాది జూన్ లో ఖలిస్థాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు గురైన విషయం తెలిసిందే. దుండగులు నిజ్జర్‌ను అతిదారుణంగా కాల్చి చంపారు. అయితే, అతడి హత్య వెనుక భారత్ ప్రమేయం ఉందంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించారు. ఇది రెండు దేశాల మధ్య దౌత్య యుద్ధానికి దారితీసింది. ఇదే సమయంలో మరో ఖలిస్థాన్ అనుకూల ఉగ్రవాది హత్యకు గురికావడం ఇప్పుడు సంచలన రేకిస్తోంది.
Also Read..
Donald Trump | మా నాన్న డొనాల్డ్ ట్రంప్ చనిపోయారు.. జూనియర్ ట్రంప్ ట్వీట్ వైరల్
Go to India | ‘ఇండియాకు వెళ్లిపోండి’.. కెనడాలోని భారతీయ హిందువులకు ఖలిస్థాన్ ఉగ్రవాది బెదిరింపు
Exercise utmost caution | అత్యంత అప్రమత్తంగా ఉండండి.. కెనడాలోని భారతీయులకు కేంద్రం సూచన
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

