Donald Trump | అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్’ అంటూ ఆయన ఇచ్చిన నినాదానికి అమెరికన్లు ఓట్ల వర్షం కురిపించారు. దీంతో అగ్రరాజ్యానికి 47వ అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికయ్యారు. రెండోసారి అధ్యక్ష పదవి చేపట్టి శ్వేత సౌధంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఇక ట్రంప్ గెలుపు వెనుక ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk) ఉన్న విషయం తెలిసిందే. అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌కు మొదటి నుంచి తన పూర్తి మద్దతు ఇస్తూవచ్చారు. ఆయన గెలుపుకై తీవ్రంగా కృషి చేశారు. ఇప్పుడు ట్రంప్ గెలవడంతో వీరిద్దరికీ సంబంధించిన ఓ వీడియో మరోసారి వైరల్ అవుతోంది.
ట్రంప్ – మస్క్ కలిసి ఓ పాటకు స్టెప్పులేసిన వీడియో మరోసారి తెరపైకి వచ్చింది. ప్రముఖ పాప్ మ్యూజిక్ బ్యాండ్ ‘బీ గీస్’ (Bee Gees) బృందం చేసిన ర్యాప్ సాంగ్ ‘స్టేఇన్ అలైవ్’ (Stayin Alive) అంటూ సాగే పాటకు ట్రంప్, మస్క్ కలిసి ఉత్సాహంగా స్టెప్పులేశారు. అయితే, అది నిజమైన వీడియో కాదు. కృత్రిమ మేధతో సృష్టించిన వీడియో. అధ్యక్ష ఎన్నికల వేళ ట్రంప్‌ను మస్క్ ఇంటర్వ్యూ చేసిన సమయంలో ఈ వీడియో బయటకు వచ్చింది. దీన్ని ట్రంప్ తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేస్తూ.. మమ్మల్ని విద్వేషించే వాళ్లు దీన్ని ఏఐ అని చెబుతారు అంటూ అప్పట్లో వ్యాఖ్యానించారు. ఇక తాజాగా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించడంతో మరోసారి ఆ వీడియో నెట్టింట దర్శనమిస్తోంది.
Haters will say this is AI 🕺🕺 pic.twitter.com/vqWVxiYXeD
— Elon Musk (@elonmusk) August 14, 2024
Also Read..
Elon Musk | విక్టరీ సెలబ్రేషన్స్.. ట్రంప్ ఫ్యామిలీ ఫొటోలో ఎలాన్ మస్క్.. వైరలవుతున్న పిక్
Donald Trump | ఇప్పుడు గెలిచినా.. వచ్చే ఏడాదే అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణం..!
US President | అమెరికా అధ్యక్షుడి జీతం.. ఇతర సౌకర్యాల గురించి తెలుసా..?