గురువారం 28 మే 2020
International - Apr 27, 2020 , 17:18:38

తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శం : టీఆర్‌ఎస్‌ మలేషియా

తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శం : టీఆర్‌ఎస్‌ మలేషియా

హైదరాబాద్‌ : కరోనా కట్టడికి సీఎం కేసీఆర్‌ తీసుకుంటున్న చర్యలు అద్భుతంగా ఉన్నాయని, వలస కార్మికులను ఆదుకుంటూ.. తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచిందని టీఆర్‌ఎస్‌ మలేషియా అధ్యక్షుడు చిట్టిబాబు కొనియాడారు. టీఆర్‌ఎస్‌ పార్టీ 20వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా టీఆర్‌ఎస్‌ మలేషియా శాఖ.. అక్కడ చిక్కుకున్న దినసరి కార్మికులకు నెలకు సరిపడా నిత్యావసర సరుకులను పంపిణీ చేసింది. నాలుగు అనాథశరణాలయాలకు కూడా నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. ఆనాడు జలదృశ్యంతో మొదలై ఈనాడు సుజల దృశ్యంతో దేశంలోనే గొప్పదైన కాళేశ్వరం ప్రాజెక్టు ఫలాలను అన్నదాతలకు అందించడంలో సీఎం కేసీఆర్‌ విజయవంతం అయ్యారని పేర్కొన్నారు. ప్రపంచం నలుమూలల ఉన్న ఆయా దేశాల పార్టీ శాఖల సభ్యులకు టీఆర్‌ఎస్‌ మలేషియా శాఖ శుభాకాంక్షలు తెలిపింది. 
logo