T20 World Cup 2024 | వరల్డ్ కప్‌లో ‘అమూల్’.. మూడు జట్లకు స్పాన్సర్‌గా మిల్క్ బ్రాండ్..!
T20 World Cup 2024 : భారతీయ పాల కంపెనీ అమూల్(Amul)కు మరోసారి అంతర్జాతీయ ఖ్యాతి లభించనుంది. జూన్‌లో జరుగబోయే ప్రతిష్ఠాత్మక టీ20 వరల్డ్ కప్(T20 World Cup 2024)లో ఈ డెయిరీ బ్రాండ్ పేరు మార్మోగనుంది.
T20 World Cup 2024 : భారతీయ పాల కంపెనీ అమూల్(Amul)కు మరోసారి అంతర్జాతీయ ఖ్యాతి లభించనుంది. జూన్‌లో జరుగబోయే ప్రతిష్ఠాత్మక టీ20 వరల్డ్ కప్(T20 World Cup 2024)లో ఈ డెయిరీ బ్రాండ్ పేరు మార్మోగనుంది. అవును.. అమూల్ కంపెనీ తాజాగా శ్రీలంక(Srilanka) జట్టుకు స్పాన్సర్‌గా ఎంపికైంది. ఈ విషయాన్ని మంగళవారం లంక క్రికెట్ బోర్డు అధికారికంగా వెల్లడించింది.
‘భారత పాల ఉత్పత్తుల్లో అగ్రగామిగా ఉన్న అమూల్‌ను శ్రీలంక అధికారిక స్పాన్సర్‌గా ఎంపికచేశాం. టీ20 వరల్డ్ కప్‌లో అమూల్ లంక జట్టుకు స్పాన్సర్‌గా ఉండనుంది’ అని లంక బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది. అమెరికా, వెస్టిండీస్ గడ్డపై జరిగే మెగా టోర్నీలో దక్షిణాఫ్రికా, అమెరికా జట్లకు సైతం అముల్ స్పాన్సర్‌గా వ్యహరించనుంది.
అమెరికా, దక్షిణాఫ్రికా జట్లు

చాంపియన్స్ ట్రోఫీతో..
అమూల్ కంపెనీ క్రికెట్ జట్లకు స్పాన్సర్‌గా వ్యవహరించడం ఇదే మొదటిసారి కాదు. 2017 చాంపియన్స్ ట్రోఫీ సమయంలో న్యూజిలాండ్(Newzealand)కు, 2011 వరల్డ్ కప్‌లో నెదర్లాండ్స్ జట్లకు ఈ మిల్క్ బ్రాండ్ స్పాన్సర్‌గా ఉంది. అంతేకాదు బీసీసీఐ 2023లో నిర్వహించిన మహిళల ప్రీమియర్ లీగ్(WPL 2023) సీజన్‌కు అమూల్ స్పాన్సర్‌గా ఎంపికైన విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి
- MLA Talasani | కాంగ్రెస్, బీజేపీ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయాయి : ఎమ్మెల్యే తలసాని
- T20 World Cup 2024 | పాకిస్థాన్ జట్టుకు కొత్త జెర్సీ.. ‘మ్యాట్రిక్స్’ థీమ్ అర్థమిదే..!
- Rain Alert | హైదరాబాద్ వాసులకు అలెర్ట్.. రాబోయే గంటలో భారీ వర్షం..!
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

