T20 World Cup 2024 | పాకిస్థాన్ జట్టుకు కొత్త జెర్సీ.. ‘మ్యాట్రిక్స్’ థీమ్ అర్థమిదే..!
T20 World Cup 2024 : ప్రతిష్ఠాత్మక టీ20 వరల్డ్ కప్ కోసం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(Pakistan Cricket Board) కొత్త జెర్సీని తీసుకొచ్చింది. ముదురు ఆకుపచ్చ రంగులో ఉన్న జెర్సీపై 'పాకిస్థాన్' అని ఇంగ్లీష్‌లో పెద్ద అక్షరాలతో ఉంది.
T20 World Cup 2024 : ప్రతిష్ఠాత్మక టీ20 వరల్డ్ కప్ కోసం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(Pakistan Cricket Board) కొత్త జెర్సీని తీసుకొచ్చింది. ‘మ్యాట్రిక్స్'(Matrix) థీమ్‌తో కూడిన ఈ జెర్సీ ఐక్యతకు సూచిక అని పీసీబీ తెలిపింది. ముదురు ఆకుపచ్చ రంగులో ఉన్న జెర్సీపై పాకిస్థాన్ అని ఇంగ్లీష్‌లో పెద్ద అక్షరాలతో ఉంది.
జెర్సీ కుడివైపు టీ20 వరల్డ్ కప్ లోగో, ఎడమవైపు పాక్ క్రికెట్ బోర్డు సింబల్ ఉన్నాయి. కెప్టెన్ బాబర్ ఆజాం(Babar Azam), పేసర్ షాహీన్ అఫ్రిది, ఆల్‌రౌండర్ షాదాబ్ ఖాన్(ShadaKhan)లు పాక్ కొత్త జెర్సీ ధరించి ఫొటోలకు పోజిచ్చారు.
🎵𝑳𝒂𝒑𝒂𝒊𝒕 𝒌𝒉𝒖𝒅 𝒑𝒆𝒓 𝒘𝒂𝒕𝒂𝒏 𝒌𝒂 𝒑𝒂𝒓𝒄𝒉𝒂𝒎, 𝒃𝒂𝒋𝒂 𝒅𝒆 𝒅𝒂𝒏𝒌𝒂, 𝒎𝒂𝒄𝒉𝒂 𝒅𝒆 𝒔𝒉𝒐𝒐𝒓!🎵
Presenting Pakistan 𝐌𝐚𝐭𝐫𝐢𝐱 𝐉𝐞𝐫𝐬𝐞𝐲’𝟐𝟒! Pre-order now: https://t.co/TWU32T9BHd#WearYourPassion | #WeHaveWeWill pic.twitter.com/akwWjkjZBB
— Pakistan Cricket (@TheRealPCB) May 6, 2024
మళ్లీ బాబర్‌కే పగ్గాలు
వన్డే వరల్డ్ కప్ తర్వాత పాక్ క్రికెట్లో అనూహ్య పరిణామాలు జరిగాయి. కెప్టెన్‌గా బాబర్ ఆజాంను, వీదేశీ కోచ్‌లను పీసీబీ తొలగించింది. అయితే.. కొత్త సారథులు విఫలమవ్వడంతో మళ్లీ బాబర్‌కే పగ్గాలు అప్పగించింది. అంతేకాదు టీమిండియాకు 2011లో కోచ్‌గా ఉన్న గ్యారీ కిర్‌స్టెన్‌ను హెడ్‌కోచ్‌గా నియమించింది.

వరల్డ్ కప్ ముందు పాకిస్థాన్ జట్టు ఐర్లాండ్, ఇంగ్లండ్‌లతో పొట్టి సిరీస్ అడనుంది. మే 10 నుంచి మే 30 లోపు ఐర్లాండ్‌తో మూడు, ఇంగ్లండ్‌తో నాలుగు మ్యాచ్‌ల సిరీస్ జరుగనుంది. ఈ సిరీస్ కోసం ఇప్పటికే పీసీడీ స్క్వాడ్‌ను ప్రకటించింది.
పాకిస్థాన్ స్క్వాడ్ : బాబర్ ఆజాం(కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్(వికెట్ కీపర్), సయీం అయూబ్, ఇర్ఫాన్ ఖాన్, అజం ఖాన్(వికెట్ కీపర్), ఉస్మాన్ ఖాన్, ఫఖర్ జమాన్, ఇఫ్తికార్ అహ్మద్, షాదాబ్ ఖాన్, ఇమద్ వసీం, అఘా సల్మాన్, హసన్ అలీ, నసీం షా, మహమ్మద్ అమిర్, షాహీన్ అఫ్రిది, హ్యారిస్ రౌఫ్, అబ్రార్ అహ్మద్, అబ్బాస్ అఫ్రిది.
ఇవి కూడా చదవండి
- Koppula Eshwar | న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: కొప్పుల ఈశ్వర్
- Skill Case | స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ మరోసారి వాయిదా
- Viral Video | ఇన్విజిబుల్ పానీ పూరిపై నెటిజన్ల నెక్ట్స్ లెవెల్ రియాక్షన్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

