పక్కింటి కుక్క ఒంటరిగా ఉందని ఆ బుడ్డోడికి ఎలా తెలిసిందో? బుడిబుడి నడకలతో తోటలోకి వచ్చేశాడు. కానీ వాళ్లిద్దరి మధ్య ఫెన్సింగ్ అడ్డుగానే ఉంది. అది దాటి వెళ్లలేడు కదా. అందుకే అక్కడే ఉన్న బంతి తీసి ఫెన్సింగ్ మీదుగా విసిరేశాడు. అది చూసిన కుక్క వెంటనే వెళ్లి ఆ బంతి పట్టేసుకుంది. తిరిగివచ్చి మళ్లీ ఆ చెక్కల ఫెన్సింగ్ పైనుంచి బుడతడికి ఇచ్చేసింది.
అది అందుకున్న పసివాడు మళ్లీ బంతిని విసిరేశాడు. అలా వాళ్లిద్దరూ ఆడుకుంటున్న వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీన్ని బ్యూటెంగ్బైడెన్ అనే ట్విట్టర్ హ్యాండిల్లో షేర్ చేయగా.. కొన్ని గంటల్లోనే లక్షలాది వ్యూస్ వచ్చాయి. వేలాది మంది దీనికి లైకులు కొట్టారు. నెటిజన్లు ఈ వీడియో చూసి రకరకాల కామెంట్లు చేస్తున్నారు. నిజమైన స్నేహానికి ఇలాంటి కంచెలు అడ్డుకావని కొందరు అంటుంటే.. ఈ వీడియో చూస్తే రోజు మొత్తం ఆనందంగా గడిచిపోతుందని మరికొందరు అంటున్నారు.
Two-year-old playing fetch with neighbor’s dog.. 😊
🎥 YT: Erin Richter pic.twitter.com/SrvTns5vhi
— Buitengebieden (@buitengebieden) October 6, 2022