ఉత్తర అట్లాంటిక్‌లో ఈ నెల 7న అమెరికా సీజ్ చేసిన రష్యా జెండా ఉన్న నౌకలోని సిబ్బందిలో ముగ్గురు భారతీయులు ఉన్నారు. వీరిలో హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రా జిల్లాకు చెందిన రిక్షిత్ చౌహాన్ (26) ఒకరు. ఆయన మర్చంట్ నేవీ అధికారి. ఆయనకు వచ్చే నెల 19న పెండ్లి జరగవలసి ఉంది.
ఆయన సురక్షితంగా తిరిగి వచ్చేలా చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీకి, విదేశాంగ మంత్రి జైశంకర్‌కు ఆయన కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేశారు. అమెరికా నిర్బంధంలో ఉన్న భారతీయుల వివరాలు సేకరిస్తున్నామని భారత్ తెలిపింది. సిబ్బందిలో ముగ్గురు భారతీయులు, 20 మంది ఉక్రెయినియన్లు, ఆరుగురు జార్జియన్లు, ఇద్దరు రష్యన్లు ఉన్నారు. వీరిలో ఇద్దరు రష్యన్లను మాత్రమే అమెరికా వదిలిపెట్టింది.