Canary Islands | ప్రపంచవ్యాప్తంగా ఏ దేశమైనా పర్యాటక రంగాన్ని ప్రోత్సహిస్తుంది. తమ దేశానికి రండి అంటూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టూరిస్ట్‌లను ఆహ్వానిస్తుంది. పర్యాటకులను ఆకర్షించేందుకు ప్రత్యేక ఆఫర్లను కూడా ప్రకటిస్తుంటుంది. పర్యాటక రంగం మెరుగుపడితేనే పెట్టుబడులు వస్తాయని ప్రభుత్వాలు భావిస్తుంటాయి. అంతేకాదు స్థానికులకు కూడా మంచి ఉపాధి ఉంటుంది. అయితే, స్పెయిన్ (Spain)లోని కేనరీ ఐలాండ్ (Canary Islands) ప్రజలు మాత్రం ఇందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. పర్యాటకులు తమ దేశానికి రావొద్దంటూ ఏకంగా వీధుల్లోకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు (protest against tourism).
#Latest: More than 135,000 people took to the streets across the Canary Islands today, May 18, to shout that #CanariasTieneUnLímite (Canary Islands Have a Limit), expressing concerns about the high cost of living caused by excessive tourism exploitation.#18M #canaryislands pic.twitter.com/qPOmt6xTof
— Amazigh World News ⵣ (@AmazighWNews) May 18, 2025
కేనరీ దీవులు.. వాయువ్య ఆఫ్రికా తీరంలో ఉన్న స్పానిష్ ద్వీపసమూహం. ఈ దీవులను సందర్శించేందుకు ఏటా పెద్ద సంఖ్యలో ప్రజలు తరలి వస్తుంటారు. అయితే, అపరిమిత పర్యాటకంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీని వల్ల పర్యావరణం దెబ్బతినడంతో పాటు, స్థానికులకు ఇళ్లు దొరకడం కష్టంగా మారిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు కేనరీ ద్వీపసమూహంలోని ఏడు దీవుల్లో ఆదివారం నిరసన ప్రదర్శన ర్యాలీ చేపట్టారు.
Protests in the Canary Islands against overtourism, where the influx of over 1 million tourists monthly-half the local population of 2.2 million—has led to severe strain on infrastructure,
What is the answer
pic.twitter.com/Pey4SQA5b3— Science girl (@gunsnrosesgirl3) May 18, 2025
‘కేనరీ దీవులు అమ్మకానికి లేవు’, ‘కేనరీ దీవులు మీరు స్వర్గదామం కాదు’ వంటి ప్లకార్డులను ప్రదర్శిస్తూ వేల సంఖ్యలో ప్రజలు ర్యాలీచేపట్టారు. అధిక పర్యాటక ప్రభావాన్ని అరికట్టాలని, అద్దెలను నియంత్రించాలని, కొత్త పర్యాటక అభివృద్ధి ప్రాజెక్టులను నిలిపివేయాలంటూ నినదించారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ దీపసమూహంలోని అతిపెద్ద దీవి అయిన టెనెరిఫేలో 7,000 మంది, గ్రాన్ కెనరియాలో 3,000 మంది, లాంజరోట్‌లో 1,500 మంది, ఫ్యూర్టెవెంచురాలో 1,000 మంది ఈ నిరసనల్లో పాల్గొన్నారు.
Islas Canarias
Ha hablado
Canary Islands #Canariastieneunlimite #CanariasTieneUnLímite #canary #islands #18M
Video pic.twitter.com/SxEfoBchzq— 🇮🇨 💖MADAY 💓🇮🇨 (@ChicaGuachinet) May 18, 2025
కాగా, కేనరీల్లో పర్యాటక అభివృద్ధిని స్థానిక ప్రజలు చాలా కాలంగా వ్యతిరేకిస్తున్నారు. తమ సమస్యలను అధికారులు పట్టించుకోకుండా పర్యావరణం, నివాసితులకు నష్టం కలిగించే విధంగా పెట్టుబడిదారుల ప్రయోజనాలకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని మండిపడుతున్నారు. కాగా, పర్యాటక రంగం వల్ల ఈ దీవుల్లో ప్రతి పది మందిలో నలుగురికి ఉపాధి లభిస్తోందని, స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో 36 శాతం వాటా ఇదే రంగం నుంచి వస్తోందని గణాంకాలు చెబుతున్నాయి. అయినప్పటికీ సమస్యలను అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ప్రపంచంలోనే అత్యధికంగా పర్యాటకులను ఆకర్షిస్తున్న దేశాల్లో ఫ్రాన్స్ మొదటి స్థానంలో ఉండగా స్పెయిన్ రెండో స్థానంలో ఉంది. 2025 మొదటి త్రైమాసికంలో స్పెయిన్‌ను రికార్డు స్థాయిలో 17.1 మిలియన్ల మంది సందర్శించారు. సుమారు 2.24 మిలియన్ల జనాభా కలిగిన కేనరీ దీవులు 4.36 మిలియన్ల మంది విదేశీ పర్యాటకులకు ఆతిథ్యమిచ్చాయి. ఇక 2024లో ఈ దీవులను 15.2 మిలియన్ల మంది పర్యాటకులు సందర్శించారు. ఈ ఏడాది ఆ సంఖ్యను అధిగమించే అవకాశం ఉందని అంచనా.
Also Read..
Bangladesh | చర్చల ద్వారా భారత్‌తో వాణిజ్య సమస్యలను పరిష్కరించుకుంటాం : బంగ్లాదేశ్
Joe Biden | అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌కు ప్రోస్టేట్ క్యాన్సర్
Greater Bangladesh | గ్రేటర్ బంగ్లాదేశ్ మ్యాప్‌లో భారత రాష్ర్టాలు!