న్యూఢిల్లీ : తోబుట్టువులకు ఒకరిపై ఒకరికి ఉండే ప్రేమ, అనుబంధాన్ని మాటల్లో వర్ణించలేం. తోబుట్టువులను కాపాడుకునేందుకు ఓ పాప తీసుకున్న చొరవ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. తాజా వీడియోలో ముగ్గురు తోబుట్టువులైన చిన్న పాపలు కన్స్ట్రక్షన్ సైట్లో కనిపిస్తారు. వారి ముందుకు ఓ వాహనం చొచ్చుకువస్తుండగా పసికట్టిన పాప తన చెల్లెళ్లను కాపాడుకునేందుకు వాహనానికి ఎదురుగా నిలబడి రెండు చేతులు అడ్డంగా చాపుతుంది.
Little girl takes her big sister job seriously…👧👼❤️ pic.twitter.com/5fDG2XVJ1g
— 𝕐o̴g̴ (@Yoda4ever) December 14, 2022
వాహనం ఆగిపోవడంతో ఆపై ఇద్దరు తోబుట్టువులను పాప క్షేమంగా ఇంటిలోపలికి తీసుకువెళ్లడం కనిపిస్తుంది. వారు లోపలికి వెళ్లిన తర్వాత వాహనం వెళ్లిపోతుంది. చిన్నారి సమయస్ఫూర్తికి, తోబుట్టువులను కాపాడుకోవాలనే తపనకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. యోగ్ అనే యూజర్ ట్విట్టర్లో ఈ వీడియోను షేర్ చేశారు.
చిన్నారి తన సోదరి పాత్రను సీరియస్గా పోషించిందని వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియోను ఇప్పటివరకూ లక్షకు పైగా వీక్షించారు. ఈ చిన్నారికి నేను బిగ్ హగ్ ఇవ్వాలనుకుంటున్నానని ఓ యూజర్ కామెంట్ చేయగా, అద్భుతం..పాపకు నాలుగైదేండ్లు ఉంటాయేమో అని మరో యూజర్ రాసుకొచ్చారు.