మాస్కో: రష్యాతో తలపడేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పంపిన రెండు అమెరికన్ జలాంతర్గాములను ఎదుర్కొనేందుకు తగినన్ని రష్యన్ అణు జలాంతర్గాములు ఉన్నాయని ఆ దేశ పార్లమెంట్ సభ్యుడు ఒకరు వెల్లడించారు. ప్రపంచంలోని సముద్ర జలాల్లో ఉన్న రష్యన్ అణు జలాంతర్గాముల సంఖ్య అమెరికాతో పోలిస్తే చాలా ఎక్కువని ఆయన వ్యాఖ్యానించారు.
ట్రంప్ దిశ మార్చి జలాంతర్గాములను పంపిన ఆయా ప్రాంతాలు అమెరికా అధీనంలో ఉన్నవేనని, వాటిపై తాము వ్యాఖ్యానించాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు. కాగా రష్యా భద్రతా మండలి ఉప చైర్మన్ మెద్వదెవ్ కవ్వింపు ప్రకటనలకు స్పందనగా అమెరికన్ జలాంతర్గాములను అనువైన ప్రాంతాలకు తరలించాలని ఆదేశించినట్లు ట్రంప్ తెలిపారు.