ఇస్లామాబాద్ : శానిటరీ ప్యాడ్స్పై పన్ను విధింపుపై పాకిస్థాన్ ప్రభుత్వంపై ఆ దేశానికి చెందిన యువ న్యాయవాది మహనూర్ ఒమర్ న్యాయపోరాటానికి దిగారు. ఇది మహిళలపై ఆర్థిక భారాన్ని మోపడమేనని ఈ 25 ఏండ్ల యువ న్యాయవాది పేర్కొన్నారు.
మహిళల ఆరోగ్యానికి, లక్షలాది మంది మహిళల శ్రేయస్సుకు శానిటరీ ప్యాడ్స్ వినియోగం తప్పనిసరి అని పేర్కొన్న ఆమె ప్రభుత్వం ఇలా ‘పీరియడ్స్ ట్యాక్స్’ విధిస్తూ వారిపై భారం మోపడం తగదని పేర్కొన్నారు.