జెనీవా: టైప్-2 డయాబెటిస్ చికిత్సలో వినియోగించే డ్రగ్ ‘ఒజెమ్పిక్’ మౌంజారో, ఇతర జీఎల్పీ-1 ఔషధాల నకిలీ వెర్షన్ల విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) తాజాగా హెచ్చరికలు చేసింది. బరువు తగ్గించుకొనే మార్గంగా ఎక్కువగా ఉపయోగిస్తున్న ఈ ఔషధాల నకిలీ విషయంలో జాగ్రత్తగా ఉండాలని, ఫేక్ వెర్షన్లు మార్కెట్లకు పోటెత్తుతున్నాయని పేర్కొన్నది.
నకిలీ మందు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయని హెచ్చరించింది. గత ఏడాది అక్టోబర్‌లో బ్రెజిల్, ఐర్లాండ్‌లలో, డిసెంబర్లో అమెరికాలో ఈ తప్పుడు ఉత్పత్తుల మూడు బ్యాచ్‌లను గుర్తించినట్టు పేర్కొన్నది. ఆన్లైన్ లేదా సోషల్ మీడియాలో కాకుండా విశ్వసనీయమైన వైద్యుల మార్గం ద్వారానే ఔషధాన్ని కొనుగోలు చేయాలని సూచించింది.