5 రోజుల్లో బ్రెయిన్ ట్యూమర్ మటుమాయం!
క్యాన్సర్ రకాల్లో ‘గ్లియోబ్లాస్టోమా’ అనేది ప్రాణాంతకమైనది. ఈ వ్యాధి బారినపడిన రోగుల్లో బ్రెయిన్ ట్యూమర్‌ను ఐదు రోజుల్లో మటుమాయం చేసే అద్భుతమైన ఔషధాన్ని పరిశోధకులు అభివృద్ధి చేశారు. అమెరికాలోని మసాచుసెట్స్‌కు చెందిన ‘మాస్ జనరల్ క్యాన్సర్ సెంటర్' పరిశోధకులు ‘కార్వీ3-టీమ్-ఈ’ అనే టీ- సెల్ థెరపీ నుంచి తయారుచేసిన ఔషధం ఊహించని ఫలితాన్ని చూపింది.
- సరికొత్త ఔషధాన్ని తయారు చేసిన పరిశోధకులు
న్యూఢిల్లీ, మార్చి31: క్యాన్సర్ రకాల్లో ‘గ్లియోబ్లాస్టోమా’ అనేది ప్రాణాంతకమైనది. ఈ వ్యాధి బారినపడిన రోగుల్లో బ్రెయిన్ ట్యూమర్‌ను ఐదు రోజుల్లో మటుమాయం చేసే అద్భుతమైన ఔషధాన్ని పరిశోధకులు అభివృద్ధి చేశారు. అమెరికాలోని మసాచుసెట్స్‌కు చెందిన ‘మాస్ జనరల్ క్యాన్సర్ సెంటర్’ పరిశోధకులు ‘కార్వీ3-టీమ్-ఈ’ అనే టీ- సెల్ థెరపీ నుంచి తయారుచేసిన ఔషధం ఊహించని ఫలితాన్ని చూపింది. 2024లో నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్‌లో మొదటి ముగ్గురు పేషంట్లలోని ట్యూమర్ల పరిమాణం గణనీయంగా తగ్గినట్టు గుర్తించారు.
వీరి పరిశోధనపై ‘ద న్యూ ఇంగ్లండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్’ కథనం ప్రకారం, ఔషధం ఒక్క డోస్‌తో.. కొన్ని రోజుల్లో కణితి గణనీయంగా కుంచించుకుపోయింది. ఒక సందర్భంలో కణితి దాదాపు మాయమైంది. ముగ్గురు రోగుల్లో ఒకరికి 5 రోజుల్లోనే ట్యూమర్ తగ్గిపోవటం.. క్యాన్సర్ చికిత్సలోనే ఒక సంచలనం. ‘కార్-టీ’ సెల్ థెరపీ ద్వారా శరీరంలోని రోగ నిరోధక కణాలను (టీ-కణాలు) జన్యుపరంగా మార్చి, క్యాన్సర్ కణాలను గుర్తించి చంపేలా చేస్తారు. దీంట్లో పేషెంట్ టీ-కణాలను సేకరించి, ప్రయోగశాలలో మార్పులు చేసి, తిరిగి రోగి శరీరంలోకి ప్రవేశపెడతారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

