First Flying Car | ప్రపంచంలోనే తొలి ఎగిరే కారుకు అమెరికా ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కాలిఫోర్నియాకు చెందిన అలీఫ్ ఏరోనాటిక్స్ కంపెనీ తయారు చేసిన ‘మాడల్ ఏ’ కారు రోడ్డుపైనా నడువగలదు.. గాలిలో ఎగురగలదు.
ఒక్కసారి ఫుల్ చార్జింగ్ చేస్తే 177 కిలోమీటర్ల వరకు గాలిలో ప్రయాణించొచ్చు. అదే రోడ్డు మీద అయితే 322 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనమైన ఈ కారు ధర రూ.2.46 కోట్లు.