ఇస్లామాబాద్: పాకిస్థాన్లోని వేదకాలపు నాటి తక్షశిలలో ప్రభుత్వం చేపడుతున్న పరిరక్షణ పనులపై ఐక్యరాజ్య సమితి సాంస్కృతిక విభాగం యునెస్కో హెచ్చరించింది. ఈ పురాతన కట్టడాల సంరక్షణ పనుల్లో సిమెంట్ వాడటమే కాక, ఇతర ఆధునిక ముడి పదార్థాలు వినియోగించడాన్ని గుర్తించింది. ఇది యునెస్కో నిబంధనలకు విరుద్ధమని పేర్కొని, ప్రపంచ వారసత్వ ప్రదేశ జాబితా లోంచి తక్షశిల తొలగిపోయే ప్రమాదముందని హెచ్చరించింది.
పాకిస్థాన్ పురావస్తు శాఖ ఇటీవల తక్షశిలలో ప్రారంభించిన పునరుద్ధరణ పనుల్లో సిమెంట్ వినియోగించింది. తద్వారా పురావస్తు స్మారక చిహ్నాలను పరిరక్షించడానికి యునెస్కో అంతర్జాతీయంగా ఆమోదించిన సూత్రాలను ఉల్లంఘించింది.