ఇస్లామాబాద్: పాకిస్థాన్లోని అఫ్గానిస్థాన్ శరణార్థులను స్వదేశానికి పంపించే కార్యక్రమంలో రెండో దశ ఈ నెల 1 నుంచి ప్రారంభమైంది.
ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ వెల్లడించిన సమాచారం ప్రకారం, 2023 సెప్టెంబరు 15 నుంచి 2025 ఏప్రిల్ 5 వరకు 8,61,763 మంది అఫ్గాన్ శరణార్థులు పాకిస్థాన్ నుంచి వెళ్లిపోయారు. దాదాపు 5 లక్షల మంది ఖైబర్ పఖ్తుంఖ్వాలోని రెండు మార్గాల గుండా వెళ్లిపోయారు.