Russia Ukraine War | కీవ్: తూర్పు ఉక్రెయిన్‌లోని వుహ్లెదార్ పట్టణాన్ని రష్యా సైన్యం సంపూర్ణంగా తన నియంత్రణలోకి తెచ్చుకుంది. కొండ ప్రాంతంలోని ఈ పట్టణం వ్యూహాత్మకంగా కీలకమైనది. ఈ పట్టణం నుంచి తమ దళాలను ఉపసంహరించుకున్నట్లు ఉక్రెయిన్ సైన్యం బుధవారం ధ్రువీకరించింది.
సైన్యం, పరికరాలను పరిరక్షించుకోవడానికి డొనెట్స్క్ ప్రాంతంలో ఉక్రెయిన్‌కు ఈ పట్టణం చాలా ముఖ్యమైనది. ఈ పట్టణం గుండా రష్యా, ఉక్రెయిన్లకు రవాణా సదుపాయాలు ఉన్నాయి. మొత్తం డొనెట్స్ రీజియన్‌పై పట్టు సాధించడంలో ఇది గొప్ప ముందడుగు అని రష్యా భావిస్తున్నది.