ఢాకా : బంగ్లాదేశ్ రాడికల్ గ్రూపులు డిసెంబర్ నుంచి జరుపుతున్న దాడుల్లో మృతుల సంఖ్య ఐదుకు పెరిగింది. బంగ్లాదేశ్ హిందూ బుద్ధిస్ట్ క్రిస్టియన్ యూనిటీ కౌన్సిల్ అధికార ప్రతినిధి కాజోల్ దేబ్నాథ్ తెలిపిన వివరాల ప్రకారం, ఖోకోన్ చంద్ర దాస్ (50) బుధవారం రాత్రి తన మొబైల్ బ్యాంకింగ్ దుకాణాన్ని మూసివేసి, ఇంటికి వెళ్తున్న సమయంలో కొందరు దుండగులు ఆయనపై దాడి చేశారు. షరియాపూర్ జిల్లాలోని క్యూర్భంగ బజార్ ప్రాంతంలో ఈ దాడి జరిగింది.