బ్లాంటైర్: ఆఫ్రికా దేశం మలావీలో విమానం అదృశ్యమైన ఘటన విషాదాంతమైంది. ఆ విమానం పర్వత ప్రాంతంలో కుప్పకూలటంతో అందులో ప్రయాణిస్తున్న మలావీ ఉపాధ్యక్షుడు సహా 10 మంది దుర్మరణం చెందారు.
విమాన ప్రమాదంలో ఉపాధ్యక్షుడు సౌలోస్ చిలిమా మృతిచెందారని దేశ అధ్యక్షుడు చక్వేరా ప్రకటించారు. విమానం గల్లంతైన ప్రదేశాన్ని గుర్తించామని, శకలాల్లో ఎవరూ ప్రాణాలతో లేరని ఆయన వెల్లడించారు.