China | బీజింగ్: చైనాలోని షాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లో ఎలక్ట్రిక్ సైకిల్‌పై వెళ్తూ ప్రమాదానికి గురైన వృద్ధునికి సాయపడని వారిపై ఆ వ్యక్తి కుటుంబ సభ్యులు కేసు పెట్టారు. అయితే, పాదచారులు, సాధారణ ప్రజలు నష్టపరిహారం చెల్లించవలసిన అవసరం లేదని కోర్టు తీర్పు చెప్పింది.
సహాయం చేయవలసిన బాధ్యత వారికి లేదని స్పష్టం చేసింది. ఆరోగ్యంగా ఉండే వృద్ధుడు (87) నిరుడు ఎలక్ట్రిక్ సైకిల్‌పై సవారీ చేశారు. ఆయన అకస్మాత్తుగా వీథిలో పడిపోయారు. ఆ తర్వాత ప్రాణాలు కోల్పోయారు. ఆ సమయంలో ఆ దారిలో వెళ్తున్నవారు ఆయనను గమనించి వెళ్లిపోయారు. దీనిపై వృద్ధుని కుటుంబ సభ్యులు ఆ దారినపోతూ, సాయపడని 10 మందిపై కేసు పెట్టారు.