శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
International - Jul 09, 2020 , 02:40:53

కరోనా వైరస్‌ను పట్టుకొని చంపుతుంది

కరోనా వైరస్‌ను పట్టుకొని చంపుతుంది

హూస్టన్‌:  ప్రపంచాన్ని మహమ్మారిలా పట్టిపీడిస్తున్న కరోనాను కట్టడిచేసేందుకు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ప్రయోజనం కనిపించటంలేదు. మాస్కులు ధరించినా, భౌతికదూరం పాటించినా ఏదో ఒకరూపంలో వైరస్‌ వ్యాప్తి చెందుతూనే ఉన్నది. తాజాగా ఈ వైరస్‌కు ఒక్క మాస్కుతో చెక్‌ పెట్టొచ్చు అంటున్నారు అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ హ్యూస్టన్‌ పరిశోధకులు. నోవల్‌ కరోనా వైరస్‌ను బంధించి చంపేసే మాస్కును తయారు చేశామని ప్రకటించారు. ఈ మాస్కు తన సమీపంలోకి వచ్చే కరోనా వైరస్‌ను 99.8శాతం నిర్మూలిస్తుందని పేర్కొన్నారు. నికెల్‌ ఫోమ్‌తో తయారుచేసిన ఈ మాస్కు ఆంత్రాక్స్‌ వ్యాధికి కారణమయ్యే బ్యాక్టీరియం బాసిల్లస్‌ ఆంత్రోసిస్‌ను కూడా 99.9శాతం చంపుతుందని వెల్లడించారు. logo