టెహ్రాన్: ఇరాన్ వద్దనున్న 80 శాతం శుద్ధి చేసిన 400 కిలోల యురేనియంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దృష్టిసారించినట్టు తెలుస్తున్నది. ఈ యురేనియంను స్వాధీనం చేసుకునేందుకు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టేందుకు ట్రంప్ యోచిస్తున్నట్టు వాల్‌స్ట్రీట్ జర్నల్ కథనం పేర్కొన్నది. అయితే దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని సమాచారం.
గ్రౌండ్ ఆపరేషన్ చేపడితే అమెరికా బలగాలకు ఉన్న ముప్పుపై ఆయన సంకోచిస్తున్నట్టు తెలిసింది. అమెరికా బలగాలు తమ గడ్డపై అడుగుపెడితే బుగ్గి చేస్తామని ఇప్పటికే ఇరాన్ హెచ్చరికలు జారీచేసింది. శుద్ధి చేసిన యురేనియంతో ఇరాన్ అణ్వస్ర్తాన్ని తయారు చేస్తుందేమోనని అమెరికా ఆందోళన చెందుతున్నది.