Paetongtarn Shinawatra | థాయ్‌ల్యాండ్ ప్రధాని పెటంగటార్న్ షినవత్రా (Paetongtarn Shinawatra)కు గట్టి షాక్ తగిలింది. పొరుగుదేశమైన కాంబోడియా ప్రధానితో (Cambodias leader) జరిపిన ఫోన్ సంభాషణపై షినవత్రాపై విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన ఆ దేశ రాజ్యాంగ కోర్టు ఆమెను సస్పెండ్ చేస్తూ ఇటీవలే తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. తాజాగా చర్యలు చేపట్టింది. ఈ మేరకు ఆమెను పదవి నుంచి తొలగిస్తూ శుక్రవారం తీర్పు చెప్పింది. ఆమె నియమాలను ఉల్లంఘించారని, రాజ్యాంగం ప్రకారం ప్రధాన మంత్రి పదవికి అనర్హురాలని పేర్కొంది.
ఓ ఫోన్ సంభాషణలో కంబోడియా మాజీ అధినేత హున్‌సేన్‌ను ‘అంకుల్’ అని సంబోధించిన పెటంగటార్న్ షినవత్రా.. తమ దేశ సైనిక కమాండర్‌ను తన విరోధి అని పేర్కొనడం వివాదానికి దారితీసింది. దేశ సరిహద్దుల్లో కంబోడియాతో ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో స్వయంగా ప్రధాని తమ దేశ సైనిక కమాండర్‌కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడంపై ప్రజల్లో ఆగ్రహం పెల్లుబికింది.
దీనిపై గత నెల విచారణ చేపట్టిన కోర్టు.. కంబోడియాతో జరిగిన దౌత్య వ్యవహారంలో ప్రధానమంత్రిగా నైతికతను ఉల్లంఘించారని చెప్పడానికి తగిన ఆధారాలున్నాయని పేర్కొన్నది. ప్రధానమంత్రి పదవి నుంచి సస్పెండ్ చేస్తూ రాజ్యాంగ కోర్టు తీర్పు చెప్పిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆమెపై చర్యలు తీసుకుంది. పదవి నుంచి తొలగిస్తూ తీర్పు చెప్పింది. నైతిక ఉల్లంఘనలకు పాల్పడిన 62 ఏండ్ల ప్రధాని స్రెట్టా థావిసిన్ పదవి నుంచి దిగిపోయిన తర్వాత ప్రధాని బాధ్యతల నుంచి సస్పెండ్ అయిన రెండో వ్యక్తిగా షినవత్రా నిలిచారు.
నైతిక ఉల్లంఘనలకు పాల్పడిన 62 ఏండ్ల ప్రధాని స్రెట్టా థావిసిన్ పదవి నుంచి దిగిపోవడంతో.. మాజీ ప్రధానమంత్రి (Prime Minister) తక్సిన్ షినవత్ర కుమార్తె అయిన పెటంగటార్న్ షినవత్రా నూతన ప్రధానిగా గతేడాది ఆగస్టులో బాధ్యతలు చేపట్టారు. 37 ఏళ్ల వయస్సులో ప్రధాని అయిన ఆమె.. దేశంలో ప్రధాని పదవి చేపట్టిన అతి పిన్న వయస్కురాలిగా గుర్తింపు పొందారు. రెండో మహిళా ప్రధానిగా కూడా చరిత్ర సృష్టించారు. అంతేకాదు, అందం, ఫ్యాషన్స్‌లోనూ స్టైల్ ఐకాన్‌గా, బ్యూటిఫుల్ పీఎంగా నెట్టింట విశేష ఆదరణ సొంతం చేసుకున్నారు. అయితే, ఓ ఫోన్ కాల్ ఆమె కొంప ముంచింది. పదవి చేపట్టిన ఏడాదికే దిగిపోవాల్సి వచ్చింది.
Also Read..
Israel | వార్‌జోన్‌గా గాజా సిటీ.. మానవతా సాయం పంపిణీపై ఇజ్రాయెల్ నిషేధం..!
Fighter Jet Crashes | కూలిన ఫైటర్ జెట్.. ఎగసిపడ్డ మంటలు.. షాకింగ్ వీడియో