న్యూఢిల్లీ, నవంబర్ 9: భారత్‌కు వ్యతిరేకంగా ఉగ్రవాద గ్రూపును తయారు చేసేందుకు లష్కరే తాయిబా చీఫ్ హఫీజ్ సయీద్ తన సన్నిహిత అనుచరులను బంగ్లాదేశ్‌కి పంపినట్లు లష్కర్‌కు చెందిన సీనియర్ కమాండర్ ఒకరు వెల్లడించారు. జిహాద్ పేరిట స్థానిక యువకులను రెచ్చగొట్టి వారికి ఉగ్రవాద కార్యకలాపాలలో శిక్షణ ఇచ్చేందుకు హఫీజ్ సయీద్ తన సన్నిహిత అనుచరులలో ఒకరిని బంగ్లాదేశ్‌కి పంపించినట్లు లష్కరే వర్గాలు తెలిపాయి.
అక్టోబర్ 30న పాక్‌లో లష్కర్ కమాండర్ సైఫుల్లా సయీఫ్ ఓ ర్యాలీనుద్దేశించి ప్రసంగిస్తూ భారత్‌పై జిహాద్ ప్రకటించినట్లు బహిరంగంగా చెప్పారు. బంగ్లాదేశ్‌లో తమ మనుషులు భారత్‌కు జవాబివ్వడానికి వారు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.